కెనడాలోని మనిటోబ ప్రావిన్స్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ట్రక్కు.. మినీ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మొత్తం వృద్ధులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. నైరుతి మనిటోబలోని కార్‌బెర్రీ నగరంలోని రెండు ప్రధాన రోడ్లు కలిసే చోట ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. 10 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మినీ బస్సును ట్రక్కు ఢీకొనడంతో అది పూర్తిగా కాలిపోయినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రోడ్డుపై పడిన మృతదేహాల సమీపంలో వీల్ ఛైర్లు, వాకర్లు ఉన్నాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్విటర్‌లో స్పందించారు