ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరో దశ లేఆఫ్స్‌కు (Oracle Layoffs) తెగబడుతోంది. ఈసారి హెల్త్ యూనిట్లో కొలువుల కోతకు పాల్పడుతోంది. మరోవైపు ప్రస్తుత జాబ్ ఆఫర్లను సైతం సాఫ్ట్వేర్ దిగ్గజం నిలిపివేస్తోందని, కొన్ని ఓపెన్ పొజిషన్స్ రిక్రూట్మెంట్కు బ్రేక్ వేస్తోందని సమాచారం.