తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జూన్ 19న ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.