WorldWonders

అర్జునుడి పది పేర్ల వెనుక అర్థమేంటి….. అవెలా వచ్చాయి?

అర్జునుడి పది పేర్ల వెనుక అర్థమేంటి….. అవెలా వచ్చాయి?

అర్జున… ఫల్గుణ…

మహాభారతంలో అర్జునుడికి ఏకంగా పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే ‘అర్జున ఫల్గుణ పార్టీ కిరీటి…’ అనే అర్జునుడి పదిపేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా.

పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు. ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు కౌరవులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. జమ్మిచెట్టు మీద బాణాలు తీసేటప్పుడు తాను అర్జునుడినే అనే నమ్మకం ఉత్తర కుమారుడికి కలిగించే ప్రయత్నంలో అతడు పాండవ మధ్యముడి పది పేర్లు చెప్పమంటే అర్జునుడే. స్వయంగా తన పది పేర్లు చెప్పాడు. అంతేకాదు, ఆ పేర్ల సార్ధక్యాన్ని వివరించాడు. అర్జునుడు, ఫల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేత వాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అనేవి ఆ పది పేర్లు.

‘అర్జున’ అంటే తెల్లని వర్ణమని అర్థం. అర్జునుడు తెల్లగా ఉంటాడు. అది నిర్మల వర్ణం. మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, అతడు పరిశుద్ధమైన పని చేస్తానని, అందుకే అతడిని ‘అర్జునుడు’ అంటా రని భారతంలో వుంది. అర్జునుడు ఉత్తర ఫల్గుణీ విశేషకాలంలో అంటే పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు సంధి కాలంలో జన్మించడం. ‘వల్ల ‘ఫల్గుణుడు’ అయ్యాడు.

కుంతీదేవికి కథ అనే పేరుంది కనుక ఆమె కొడుకుల్లో చివరివాడైన అర్జునుడికి ‘పార్ధుడు’ అనే పేరు వచ్చింది. ఇంద్రుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరం. అందుకే అర్జునుడు ‘కిరీటి’, యుద్ధరంగంలో అర్జునుడు. ఎప్పుడూ తన రథానికి నియమంగా తెల్లటి గుర్రాలనే కడతాడు. గనుక ‘శ్వేతవాహనుడు’ అని పేరు వచ్చింది. అర్జునుణ్ని బీభత్సు ఉంటారు. బీభత్సమంటే చూసేవారికి ఒళ్లు జలదరించేలా చేసే స్థితి. యుద్ధరంగంలో అర్జునుడు శత్రువుల్ని చీల్చిచెండాడినప్పుడు అటువంటి దృశ్యాలను సృష్టిస్తాడు కనుక ‘బీభత్సుడు’ అయ్యాడు. ఎంతటి బలవంతులు తనను ఎదిరించినా, యుద్ధంలో జయాన్ని సాధించగలదు కాబట్టి అందరూ అర్జునుణ్ని ‘విజయుడు’ అంటారు.

తాను చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు గనుక తాను ‘ఉష్ణుడు’ అని పిలవబడతానని అర్జునుడు చెప్పాడు. యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని లాగగలదు. కానీ ఆ లాగడంలో కుడిచేతితో సమానంగా ఎడమచేతి వాటం ఉంటుంది కాబట్టి ‘సవ్యసాచి’గా ప్రసిద్ధుదయ్యారు. భూమినంతటినీ జయించి, పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందడం వల్ల ‘ధనంజయుడు’ అయ్యాడు. ఖాండవవన దహన సమయంలో శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై అర్జునుడికి “కృష్ణుడు’ అనే నామధేయాన్ని ప్రసాదించి దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడి పది పేర్లు ప్రసిద్ధం.