పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్కు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు ముందస్తుగా బర్త్డే విషెస్ తెలిపారు. ఈక్రమంలో ఫుడ్ ఫ్రీ అని ప్రకటించారు. ట్రంప్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్ ఆ రెస్టారెంట్‌లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.