WorldWonders

పితృ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసు?

పితృ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసు?

తండ్రి కూడా తల్లితో సమానం. ఎప్పుడూ అటూ ఇటూ పరిగెడుతూ తల్లిలా లాలిస్తూ తండ్రి తన ప్రేమను చూపించకపోవచ్చు. అలా అని అతను పిల్లలను ప్రేమించడు అని కాదు. పిల్లలకు మార్గనిర్దేశం చేస్తూ, వారి అవసరాలను తీర్చి, తన కష్టాలన్నింటినీ మరచిపోయి పిల్లల కోసం, కుటుంబం కోసం పనిచేసే వాడు తండ్రి. అంత బాధను మనసులో దాచుకుని అందరి ముందు ధైర్యంగా, దృఢంగా, ఆరోగ్యంగా నటిస్తూ జీవితాన్ని గడిపే వాడు తండ్రి. తల్లి  ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికి మదర్స్ డే జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ ఫాదర్స్ డే కూడా జరుపుకుంటున్నారు. అసలు ప్రపంచ ఫాదర్స్ డే ఎలా ప్రారంభమైంది, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క తండ్రికీ తన పిల్లల పట్ల తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం తల్లికే తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఆడపిల్లలు మాత్రం తల్లి కంటే తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తమ జీవితంలో తొలి హీరో తమ తండ్రే గర్వంగా చెబుతుంటారు.ఈ ప్రపంచంలోని ప్రతి ఆడిపిల్ల అనేక సందర్బాల్లో తమ తండ్రి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చెబుతూ ఉంటారు. తండ్రిపై తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ఫాదర్స్ డే ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది

జూన్ మూడో వారంలో ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈసారి జూన్ 18న ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు.ప్రపంచ ఫాదర్స్ డే చరిత్ర : 1907లో అమెరికాలో తొలిసారిగా ప్రపంచ ఫాదర్స్ డేని అనధికారికంగా జరుపుకున్నారు. ప్రపంచ ఫాదర్స్ డేని అధికారికంగా 1910లో జరుపుకున్నారు. చరిత్రకారుల ప్రకారం, ఈ రోజును సోనోరా స్మార్ట్ డాడ్ ప్రారంభించారు. సోనేరా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి విలియం స్మార్ట్ అతనికి తల్లి, తండ్రి ప్రేమను అందించాడు. తండ్రి ప్రేమ, త్యాగం, అంకితభావాన్ని చూసిన సోనేరా మదర్స్ డే తరహాలో ఫాదర్స్ డేని జరుపుకోవాలని నిర్ణయించుకుంది.

జూన్ 19, 1909న, డాడ్ మొదటిసారిగా ఫాదర్స్ డేని జరుపుకున్నాడు. 1924లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కోలీ ఫాదర్స్ డేని అధికారికంగా ఆమోదించారు. నాలుగు దశాబ్దాల తరువాత, 1966లో, ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటామని ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు.

ఫాదర్స్ డేని ఇలా జరుపుకోండి: మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చేందుకు పగలు రాత్రి శ్రమించిన వ్యక్తి తండ్రి. తండ్రి నీ కోసం తన కోరికలను పక్కన పెట్టేస్తాడు. చాలా ఇళ్లలో నాన్నంటే భయం. తండ్రి మాట తప్పకుండా వినేవారూ ఉన్నారు. తండ్రులు, పిల్లల ముందు కఠినంగా ప్రవర్తించడం తప్పదు. అందుకే తండ్రీకొడుకుల మధ్య ఎంత ప్రేమ వ్యక్తమైనా ఒకరికొకరు చెప్పుకోవడం అరుదు. నేటి పిల్లలు కాస్త భయపడి తమ భావాలను వ్యక్తపరుస్తారు కానీ నడివయసు పిల్లలు మాత్రం తండ్రి ముందు నోరు విప్పరు. అమ్మపై ప్రేమను చూపించినట్లే తండ్రి పై చూపించడం కూడా ఈ ఫాదర్స్ డే నుంచి అలవాటు చేసుకోవాలి.ఈ రోజున తండ్రికి నచ్చిన బహుమతి ఇవ్వవచ్చు. లేదా రాత్రి భోజనానికి తీసుకెళ్లండి. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి తీసుకెళ్లి వారి ముఖంలో చిరు నవ్వు తీసుకువచ్చేలా చేయండి.