DailyDose

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం-TNI నేటి నేర వార్తలు

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం-TNI నేటి నేర వార్తలు

* హైదరాబాద్‌లో హిజాబ్‌ వివాదం

ఈ విషయంలో జోక్యం చేసుకున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. హిజాబ్‌ సంప్రదానికి సంబంధించిన వ్యవహారమని, ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని అన్నారు. హిజాబ్‌ పేరిట నిబంధనలు సరైనవి కావన్నారు.

* బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ముగిసిన ఐటీ రైడ్స్

తెలంగాణలోని పలువురు నేతల ఇళ్లపై ఐటీ సోదాలు ముగిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో, రియల్ ఎస్టేట్, గ్రానైట్ కంపెనీల్లో సుమారు 84 గంటలపాటు తనిఖీలు కొనసాగాయి. జేసీ బ్రదర్స్, ఎట్ హోం హోటల్స్లోనూ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు.

* కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

* హైదరాబాద్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఈరోజు తెల్లవారు జామున మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ని వనస్థలిపురం లో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి. హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.ఈ ప్రమాదం పై సమాచారం అందడటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలు ఏంటోనని దర్యాప్తు చేస్తున్నారు.

* అమర్నాథ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10లక్షలు సాయం

బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ చెరుకుపల్లి ఐలాండ్‌ సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు.ప్రభుత్వం దిగి వచ్చే వరకు ధర్నా చేస్తామని రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు 3గంటలపాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రేపల్లె ఆర్డీవో పార్థసారథి చెరుకుపల్లి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని, ఆందోళన విరమించాలని కోరారు.

* సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోరీ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. రూ.10 లక్షల విలువైన వజ్రాలు, పది తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ మహిళ కేకలు వేయడంతో స్టేషన్ లోని ప్రయాణికులు, రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే, అప్పటికే దొంగ పరారయ్యాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన స్రవంతి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. శనివారం తిరుపతి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు స్రవంతి వచ్చారు. ఈ క్రమంలో రైలు ఎక్కుతుండగా స్రవంతి చేతిలోని బ్యాగ్ ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు.

* తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నారు. వడ్డేశ్వరం గ్రామంలో డ్రగ్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులను తాడేపల్లి పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వశనీయ సమాచారం. అయితే వివరాలను పోలీసులు గోప్యం ఉంచడం విమర్శలకు తావిస్తొంది. అయితే అవి నిజంగా డ్రగ్స్ ఏనా లేక మరైదైనానా అనేది పోలీసులు విచారణ అనంతరం తేలాల్సి ఉంది.

* జునాగఢ్ లో తీవ్ర ఉద్రిక్తత

గుజరాత్ జునాగఢ్ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హజ్రత్ రోషన్ పిర్ బాబా దర్గా అక్రమంగా నిర్మించారని, 5 రోజుల్లో సరైన పత్రాలు సమర్పించకపోతే కూల్చివేస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో గొడవ మొదలైంది. 300 మంది నిన్న రాత్రి పోలీసులపై రాళ్లు విసిరారు. పోలీస్ పోస్ట్ ధ్వంసం చేసి, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పంటించారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. 155 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* పాఠశాలపై ఉగ్రవాదులు దాడి

పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు.ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని పశ్చిమ ప్రాంతంలోని ఓ పాఠశాలపై ఐసిస్ అనుబంధ ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 25 మంది విద్యార్థులు మరణించినట్లు సమాచారం. ఈ సంఘటన జూన్ 16 అర్థరాత్రి జరిగింది. ఉగాండాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎంపాండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మంది మరణించినట్లు ఉగాండా పోలీస్ ఫోర్స్ తెలిపింది.

* అప్సర హత్య కేసులోసాయి కృష్ణ కు 14 రోజుల రిమాండ్‌

శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు సాయి కృష్ణ కస్టడీ ముగియడంతో శంషాబాద్‌ పోలీసులు రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.