Business

88 వేల కోట్ల ఆచుకీ లేదన్న ఆర్బీఐ

88 వేల కోట్ల ఆచుకీ లేదన్న ఆర్బీఐ

దాదాపు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదని తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది. పాతనోట్లను రద్దు చేసి, కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ, అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి చేరినట్లు ఆర్‌టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్‌బీఐ దగ్గర లేదు.