Politics

బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్  విమర్శలు

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిరక్షరాస్యులు నడుపుతున్నారంటూ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో నిరక్షరాస్యులకు ఓటేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఢిల్లీలో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీదే అని అన్నారు.