ఫాదర్స్ డే సందర్భంగా నాసా.. మండే సూర్యుడి ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకొని శుభాకాంక్షలు తెలిపింది. ‘మన సూర్యుడు చాలా వయసున్నవాడు, వాయువులతో నిండి భారీ ఆకారం కలిగిన వాడు. కానీ మన సౌరవ్యవస్థ అంతటికీ వెలుగును, శక్తినిచ్చేవాడు ఆయనే. భానుడే లేకుంటే జీవితమే లేదు. మన తండ్రి లాంటి ఆయనకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టింది.
సూర్యుడికి నాసా ఫాదర్స్ డే విషెస్
