Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 19.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (19-06-2023)

నేడు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొదుపే మిమ్ముల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు బాధిస్తాయి.ఆఫీసుల్లో ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు కలిసి చ్చే రోజుగా చెప్పవచ్చు. చిన్న పిల్లల ఆరోగ్యం మిమ్ముల్ని కాస్త ఆందోళనకు గురిచేస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (19-06-2023)

మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యల్లో పాల్గొంటారు. చిన్నకారు వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (19-06-2023)

ఈ రోజు ఈరాశి వారి ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ స్నేహితుల సహకారంతో ఈరోజు వ్యాపారల్లో లాభాలను గడిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారి కెరీర్ బాగుంటుంది. నేడు చాలా అనుకూలంగా ఉంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (19-06-2023)

తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో చేసే పనులు కలిసివస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. చిన్నచిన్న ఆటంకాలు
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (19-06-2023)

ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది. సోదరులు, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. రాబడికి తగ్గ ఖర్చులూ ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (19-06-2023)

విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్, టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. మీరు ఎవరితో ఉంటున్నారో, వారి ప్రవర్తన పట్ల ప్రస్టేషన్‌కు గురి అవుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ ఇంటికి అనుకోని బంధువు రాక మీకు చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (19-06-2023)

మీరు విహారయాత్రకు వెళుతుంటే మీయొక్క సామానుపట్ల జాగ్రత్త అవసరం. లేనిచోమీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు.మరీముఖ్యంగా మీయొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎవరైతే చాలా కాలంగా రుణసదుపాయం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వారికి రుణసదుపాయం కలిగే అవకాశం ఉంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (19-06-2023)

ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (19-06-2023)

నేడు ఈరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వాములతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామి మీ పట్ల చాలా ప్రేమను చూపిస్తాడు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (19-06-2023)

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. మీరు ప్రయాణము చేస్తున్నవారుఐతే మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము.అశ్రద్దగాఉంటే మీవస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (19-06-2023)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. రొమాన్స్- మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంద. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (19-06-2023)

నేడు ప్రతీ సమస్యకు మీ చిరునవ్వే విరుగుడు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం అవుతాయి. మీ శ్రీమతితో వాగ్వాదం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఆఫీసులో ఈరోజు మీదే పై చేయి అవుతుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు నష్టాలు చవి చూడక తప్పదు.
🦈🦈🦈🦈🦈🦈🦈