Fashion

హైదరాబాద్‌లో 400 డ్రగ్ ఇంజెక్షన్లు పట్టివేత

హైదరాబాద్‌లో 400  డ్రగ్  ఇంజెక్షన్లు పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో  పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. 400 వరకు ఇంజక్షన్లను అధికారులు సీజ్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ (Zim trainer) నితీశ్‌, రాహుల్‌తోపాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు.పట్డుబడ్డ ఇంజక్షన్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీనివెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఇంజక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్‌ల కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది.