Politics

గాంధీభవన్‌లో రాహుల్​బర్త్​డే సెలబ్రేషన్

గాంధీభవన్‌లో రాహుల్​బర్త్​డే సెలబ్రేషన్

కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ బర్త్ డే వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​సీనియర్​నేత వీ.హనుమంతరావు హజరై.. రాహుల్ గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేశారు. శిబిరంలో పలువురు ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు రక్తదానం చేశారు. కాబోయే ప్రధాని రాహుల్​అంటూ కాంగ్రెస్​కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పలు స్కూళ్లల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు, కులాలకు, మతాలకు మధ్య బీజేపీ రెచ్చగొడుతున్న విద్వేషాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రను సక్సెస్ చేశారన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్​రాక అవసరమని, అందుకు ప్రజలు సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్​చైర్మన్​మెట్టు సాయికుమార్​తదితరులు ఉన్నారు.