Politics

జగన్‌తో రామ్‌గోపాల్ వర్మ భేటీ

జగన్‌తో రామ్‌గోపాల్ వర్మ భేటీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన వ్యాఖ్యలు చేసే చేష్టలు ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతాయి. ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ గా కూడా సెటైర్లు వేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు ఆర్జీవి. సోషల్ మీడియాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై తనదైన స్టైల్ లో స్పందిస్తూ కౌంటర్ లు ఇస్తున్నాడు. ఈయన చేసే ట్వీట్లు, పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ ప్రతిపక్షాలపై కావాలనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు (జూన్19) సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. చాలా రోజుల తర్వాత సీఎం జగన్ తో ఆర్జీవి భేటీ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.