DailyDose

బిగ్ బాస్ సరికొత్త సీజన్

బిగ్ బాస్ సరికొత్త సీజన్

బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్ రిజల్ట్ సాధించాలని చూస్తున్నారు.. కొత్త వ్యక్తులను తీసుకురావడంతో పాటు టాస్క్ లను కొత్తగా తీసుకురావాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది..

అందుకే ఈ సారి కొంత ఆలస్యంగానే సీజన్ 7 ప్రారంభం కాబోతుందని టాక్. అంతే కాదు పేరున్న స్టార్స్ ను కాస్త రేటు ఎక్కువైనా.. హౌస్ లోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్..బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్పటి మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే ఉంటారా… లేక గతంలో వినిపించిన పేర్లలో ఎవరైనా రావచ్చా అనేది ఆసక్తిగా మారింది.. ఇక షో యాజమాన్యం కూడా జనాల్లో ఈ సస్పెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఇక అంతే కాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గా.. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్. అంతే కాదు కొత్త జంటలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నట్టు సమాచారం. అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి..న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, కమెడీయన్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఇలా పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈసారి పక్కాగా భారీ రేటింగ్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారు టీమ్.