Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 20.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (20-06-2023)

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (20-06-2023)

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (20-06-2023)

అనుకున్న పనులను చేయగలుగుతున్నారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (20-06-2023)

చేసిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (20-06-2023)

శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (20-06-2023)

కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనావిధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (20-06-2023)

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (20-06-2023)

మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (20-06-2023)

మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (20-06-2023)

మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (20-06-2023)

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (20-06-2023)

మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త పడాలి. చేసిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి
🦈🦈🦈🦈🦈🦈🦈