Devotional

మంచి నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు

మంచి నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు

తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman) వెల్లడించారు. భక్తుల సేవకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. తిరుమలకు వచ్చే భక్తులు లడ్డు కౌంటర్ల(Laddu Counter)ల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రూ.14 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. రూ. 97 కోట్లతో స్విమ్స్ ఆధునికరణకు నిధులను కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.

1200 బెడ్స్‌తో అస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. రూ.6.65 కోట్లతో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి, రూ.7 కోట్లతో టీటీడీలోని అన్ని విభాగాలలో నూతన కంప్యూటర్(New Computers) ఏర్పాటుచేయడానికి సమావేశం తీర్మానించిందన్నారు. రూ.20.50 కోట్లతో సేవాసదన్, వకుళమాతతో పాటు పలు గదుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు కేటాయించాలని, రూ.2.35 కోట్లతో హెచ్‌వీసీ ప్రాంతంలో ఉన్న 144 గదులు ఆధునీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్(Police Quarters) అభివృద్ధి, మూడేళ్ల పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ టెండర్‌ను ఎల్టీఈ సంస్థకు రూ.40.50 కోట్లకు అప్పగించనున్నామని వివరించారు. రూ.1.88 కోట్లతో జీఎంసీ, ఎస్ఎంసీ ఉప విచారణ కార్యాలయాలు ఆధునీకరించనున్నమని చైర్మన్‌ వెల్లడించారు. రూ.4కోట్లతో ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో అన్నదాన భవనం నిర్మాణం,రూ.3.10 కోట్లతో తిరుమలలో స్టైన్ లెస్ స్టీల్ బిన్లు ఏర్పాటుచేస్తామన్నారు. రూ.9 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రల్ రికార్డు రూమ్ నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు.

రూ.2 కోట్లతో నగిరిలోని బుగ్గ ఆలయంలో కల్యాణమండపం నిర్మాణం, కర్నూలు జిల్లా అవుకు మండలంలో రూ.4.18 కోట్లతో ఆలయ నిర్మాణం, గుజరాత్ లోని గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో ఆలయ నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. రూ.5.61 కోట్లతో రామానుజ సర్కిల్ నుంచి రోడ్డు నిర్మాణం, రూ.7.75 కోట్లతో స్విమ్స్ లో గోడౌన్ నిర్మాణం, రూ.5 కోట్లతో ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని బోర్టు మీటింగ్‌లో తీర్మానించామని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.