కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రురాలు, WETA సంస్థ వ్యవస్థాపకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలంగాణాలోని జనగాం జిల్లా పాలకుర్తిలో పర్యటించారు. యువకులు, స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో జేరి ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, పుట్టినగడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. తెదేపా నుండి తెరాసలోకి వెళ్లిన ఎర్రబెల్లి దయాకరరావు ప్రస్తుతం పాలకుర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.