Movies

ఓటీటీలో ఆదిపురుష్‌ నిషేధం

ఓటీటీలో ఆదిపురుష్‌ నిషేధం

ఆదిపురుష్ రచ్చ మామూలుగా లేదు. రాముడి రూపురేఖల నుంచి.. హనుమంతుడి డైలాగ్స్ వరకూ.. అనేక అంశాలు కాంట్రవర్సీగా మారాయి. నేపాల్‌లో బాలీవుడ్ సినిమాలనే నిషేధించే వరకూ విషయం ముదిరింది. వివాదాస్పద డైలాగ్స్ మార్చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించినా.. గొడవ సద్దుమనగడం లేదు. మరోవైపు, ఎంత రచ్చ అయితే అంత కలెక్షన్లు అన్నట్టు.. ఆదిపురుష్‌పై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపు 400 కోట్లు వసూల్ చేసింది సినిమా.తాజాగా, ఆదిపురుష్‌ చిత్రాన్ని వెంటనే నిలిపేయాలని.. ఓటీటీలోనూ రాకుండా చూడాలంటూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌.. ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం కలకలం రేపింది. స్క్రీన్‌ప్లే, డైలాగులు.. రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చింది.

దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చూపించారని.. రాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆదిపురుష్ విధ్వంసం చేసిందని AICWA మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించింది. ఆదిపురుష్ డైరెక్టర్, రైటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరింది.అయితే, ఆదిపురుష్ ఓటీటీలోకి రాకుండా నిషేధించాలని కోరడం కలకలం రేపుతోంది. వివాదాస్పద డైలాగులు కట్ చేయడం గట్రా కాకుండా.. ఏకంగా సినిమానే నిలిపివేయాలనే డిమాండ్ పెరుగుతుండటం నిర్మాతల్లో కంగారు పెంచుతోంది. ఇప్పటికే సినిమా థియేటర్లలో రిలీజై పోయింది.. లక్షలాది మంది చూసేశారు.. మూవీ బడ్జెట్ కూడా చాలావరకు కవర్ అయిందనే ధీమాలో ఉంది మూవీ టీమ్. శాటిలైట్స్ రైట్స్‌తో లాభాల్లోకి వచ్చేయొచ్చని లెక్కలేసుకుంటుండగా.. ఇప్పుడిలా ఓటీటీలోకి రాకుండా.. ఏకంగా ప్రధాని మోదీకే లేఖలో కంప్లైంట్ చేయడంతో ఉలిక్కిపడుతున్నారు ఓం రౌత్. వివాదం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందోననే టెన్షన్లో ఉన్నారు