మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి (Jupalli) కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (PCC chief Revanth Reddy) రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ముందుగా రేపు మధ్యాహ్నం జూపల్లి, పొంగులేటి ఇళ్లకు వెళ్లనున్న రేవంత్ అక్కడ వారితో మాట్లాడనున్నారు. అనంతరం వారితో కలిసి రేపు సాయంత్రం ఢిల్లీ (delhi) వెళ్లనున్నారు.ఢిల్లీలో ముగ్గరు నేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలవనున్నారు. అనంతరం రాహుల్ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇరువురు నేతలను పార్టీలోకి అహ్వానించనున్నారు. కాగా పొంగులేటి, జూపల్లి ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో కాగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది.