బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. దేశ రాజధానిలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ అగ్రనేతల పర్యటనల పైన కూడా వారితో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఈ నెలాఖరున కేంద్రమంత్రి అమిత్ షా సభ ఏర్పాటుకు రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలతో బిజీగా ఉండనున్నారు. విదేశీ పర్యటనల అనంతరం మోడీ తెలంగాణ పర్యటనను కూడా ఖరారు చేయవచ్చు.