మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు చాలామంది రైతులు త్వరగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారు. పొలంలో ఆవు పేడకు బదులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఇది మనం తినే కూరగాయలపై తాజాదనం, రుచిని ప్రభావితం చేస్తుంది.మన దేశంలో సేంద్రీయ పద్ధతిలో పండించే రైతులు కొందరు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. వారు పండించిన కూరగాయలు మార్కెట్‌లో వెంటనే అమ్ముడుపోతాయి. అలా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీహార్‌లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్న రైతు మహ్మద్ వాసిం.. తన పొలంలో పచ్చని కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో పండించిన కూరగాయలను సమీపంలోని మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. కానీ విపరీతమైన వేడితో పంటల పండక.. దిగుబడిపై ప్రభావం చూపుతోందని తెలుపుతున్నాడు.
పంటలు పండించడానికి ముఖ్యంగా నీరు కావాలి. అయితే విపరీతమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు బాగా పడిపోయాయని మహ్మద్ వాసీం చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలకు నీరు పెట్టేందుకు కష్టమవుతుందని ఆ రైతు అంటున్నాడు. ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా కూరగాయల తీగలు ఎండిపోతున్నాయని.. దూరప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి కూరగాయలకు నీరందిస్తున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం, మహ్మద్ వసీం కూరగాయల సాగు పెంపకంలో కాకరకాయ, బీరకాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇంతకు ముందు కూరగాయల దిగుబడి బాగా ఉండేదని.., ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా దిగుబడి తగ్గిందని అంటున్నాడు. అయితే ఇంత జరిగినా అక్కడ మాత్రం కూరగాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.