హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు పర్యటించనున్నారు. శంకర్ పల్లి మండలం కొండకల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం… ఆ తర్వాత కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు.ఆ తర్వాత పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేస్తారు. అటు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రేపు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలో వందేభారత్, మెట్రో కోచ్‌లు తయారు చేసే మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.