Politics

ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఒకే ఇంటి మీద అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. అదే సమయంలో, రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీ స్పందించాలని కోరారు.ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారని రఘురామ వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇక, జగనన్న ఆణిముత్యాలు ఏంటో అర్థం కావడంలేదని రఘురామ పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే 6 వేల పాఠశాలలు మూసివేశారని తెలిపారు. దేశంలో పాఠశాల డ్రాపౌట్స్ లో ఏపీది మూడో స్థానం అని విమర్శించారు.