గ్రహాంతరవాసులు ఉన్నాయా? లేవా?.. ఈ మిస్టరీ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఉన్నాయేమో అనిపించే విధంగా పలు సంఘటనలు అయితే జరిగాయి. ఈ సంఘటనలు ఆధారంగా తీసుకొని గ్రహాంతరవాసులు ఉన్నాయని నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్ని దేశాల కంటే ఎక్కువగా గ్రహాంతవాసులపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అమెరికా. తాజాగా లాస్ వేగస్‌లో గ్రహాంతరవాసులు కనిపించాయి అంటూ స్థానికులు చెప్పడం వైరల్‌గా మారింది.
లాస్ వేగస్‌లోని కాంటెన్నియల్ హిల్స్ దగ్గర ఆకాశం నుండి ఒక ప్రకాశంతమైన వెలుగు నేలకు తాకింది. తాజాగా ఒక ఉదయం వేళ ఈ వెలుగును అక్కడి స్థానికులు చూశారు. దీంతో గ్రహాంతరవాసులు భూమి మీదకు ఎంటర్ అయ్యారు అంటూ వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ఏరియాలో డ్యూటీ చేస్తున్న ఒక ఆఫీసర్ బాడీ కెమెరాలో ఈ లైట్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆపై కొన్నిరోజులకు ఈ విజువల్స్‌ను మెట్రోపోలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.39 సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్.. అతి కొద్ది సమయంలోనే 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. ఈ లైట్ కనిపించినప్పుడు ఆ ఏరియాలో నివసించే ఒక వ్యక్తి.. అక్కడ విచిత్రమైన సంఘటన ఏదో జరుగుతుంది అంటూ చెప్తున్న కాల్ రికార్డింగ్ కూడా పోలీసులు బయటపెట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఏం లేదు అని అప్పటికే నిర్ధారించారు. కానీ ఇప్పటివరకు ఆ లైట్.. గ్రహాంతరవాసుల నుండే వచ్చిందని చాలామంది బలంగా నమ్ముతుండగా.. అది భూమిని తాకిన ఒక మెటియొర్ అని నాసా ప్రకటించింది.
ఇప్పటికీ చాలామంది స్థానికులు ఆ లైట్ వెలుగులో ఒక పెద్ద ఆకారం కనిపించింది అంటూ లాస్ వేగస్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. ఒకేసారి అంత వెలుగు రావడం స్థానికులను మాత్రమే కాకుండా పోలీసులను కూడా ఆందోళనకు గురిచేసింది. నాసా ముందస్తుగా ఈ మెటియోర్‌ను గుర్తించలేకపోయిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటికీ కొంతమంది స్థానికులు మాత్రమే కాదు.. సంఘటన సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు కూడా ఇది మెటియోర్ అని పూర్తిగా నమ్మలేకపోతున్నారు.