ప్రమాద శాతంతో మరియు ఇతర కారణల వల్ల కాళ్లు కోల్పోయిన వారికి ఖమ్మం రోటరీ క్లబ్ కమ్యూనికేషన్ సెంటర్ లో చేతన ఫౌండేషన్ EKAM యూఎస్ఏ వారి ఆర్థిక సహాయంతో 1,57,500 విలువగల కృత్రిమ పాదాలను ఉచితంగా 45 మంది వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ అధ్యక్షులు వెనిగళ్ళ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ కృత్రిమ పాదాలు అందించడం వలన వారి సొంత పనులు వారే చేసుకోగలుగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్, దొడ్డ సీతారామయ్య, రంగారావు, శంకరయ్య సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు
చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 మంది వికలాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ
