శబరిమలకు విమానంలో వెళ్లాలంటే కొచ్చి లేదా తిరువనంతపురంకు వెళ్లాలి. కొచ్చిలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శబరిమలకు 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,411 కోట్లతో ఎరుమేలిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2,570 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
శబరిమల విమానాశ్రయానికి పర్యావరణశాఖ అనుమతి
