WorldWonders

ఇవాళ అతిపెద్ద పగలు

ఇవాళ అతిపెద్ద పగలు

ఉత్తరార్ధగోళంలో జూన్ 21వ తేదీని ఏడాదిలోనే అతి సుదీర్ఘమైన రోజుగా చెప్పుకోవాలి. వేసవి కాలం ఆరంభ దినం ఇది. నేడు భూమి అక్షాంశం వంపు తిరుగుతుంది. అందుకే నేడు పగటి సమయం ఎక్కువ. ఏడాదిలో వినూత్నమైన రోజుగా దీన్ని చెప్పుకుంటారు. ఆకాశంలో సూర్యుడు ఈ రోజే అత్యంత గరిష్ఠ ఎత్తుకు చేరుకుంటాడు. కనుకనే పగటి వెలుగు మిగతా రోజులతో పోలిస్తే ఎక్కువ సమయం కొనసాగుతుంది. సరిగ్గా దక్షిణార్ధగోళానికి ఈ రోజు నుంచి శీతాకాలం మొదలవుతుంది. కనుక దక్షిణార్ధగోళానికి జూన్ 21 పొట్టి దినంగా చెప్పుకోవచ్చు. భూమి రోజుకొకసారి తన అక్షం చుట్టూ తిరుగుతుంది. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మధ్య ఊహాత్మక రేఖ ఉంటుంది. సూర్యుని చుట్టూ దాని కక్ష్యలో భూమి పరిభ్రమిస్తున్నప్పుడు ఊహాత్మక రేఖ వద్ద వంపు తిరుగుతుంది. అందుకనే దక్షిణార్ధగోళం ఆరు నెలలు, ఉత్తరార్ధగోళం ఆరు నెలల చొప్పున సూర్యుడి వైపు వంగి ఉంటాయి. వీటిని బట్టి వేసవి, శీతాకాలాలు మారుతుంటాయి.