ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్‌లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్’ (ఐపీఐ) కోరింది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై పలు చట్టాల్ని మోదీ సర్కార్ ప్రయోగిస్తున్న సంగతిని అధ్యక్షుడు బైడెన్‌కు తెలిపింది.ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన అంశాన్ని జో బైడెన్ లేవనెత్తాలని ఐపీఐ గ్లోబల్ నెట్‌వర్క్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐపీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వివిధ చట్టాల కింద జర్నలిస్టులను జైలుపాలు చేస్తూ, కక్షసాధింపు చర్యలకు దిగటం భారత్‌లో సర్వసాధారణమైందని ఆందోళన వ్యక్తం చేసింది.