తెలంగాణ వైద్య కళాశాలల్లో నాన్‌స్టాప్‌గా జరిగిన ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్లు తనిఖీలు చేసిన ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఈడీ భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకుంది. మల్లారెడ్డి వైద్య కళాశాలలో రూ.1.4 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.89 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.16చోట్ల ఈడీ అధికారుల తనిఖీలు,పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినందుకు ఈడీ అధికారుల తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ట్వీట్ చేసింది.