అమలాపురంలో నిర్వహించిన “వారాహి విజయ యాత్ర”లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దళితులకు మేనమామ అని అంబేద్కర్ విదేశీ పథకాన్ని తీసేసి మోసం చేశాడని విమర్శించారు.ఆ ఒక పథకం మాత్రమే కాదు దాదాపు 20 కి పైగా దళిత పథకాలు తీసేసారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.“అంబేద్కర్ విదేశీ విద్యా” పథకానికి ఆ పేరు తీసేసి “జగనన్న విదేశీ విద్యా” పథకం పేరు పెట్టుకోవటాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.అంబేద్కర్ కంటే గొప్పవాడివా.జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.ప్రజలు మారారు.తరాలు మారాయి.ఆలోచన విధానం కూడా మారాలి జగన్ అంటూ పవన్ అమలాపురం వారాహి విజయ యాత్ర సభలో హెచ్చరించారు.వచ్చే ఎన్నికలలో యువత జాగ్రత్తగా ఓట్లు వేయాలని పవన్ సూచించారు.గత ఎన్నికలలో వైసీపీని గెలిపించారు కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు.తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవని పవన్ వ్యాఖ్యానించారు.ఇంకా అనేక విషయాలపై వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇదే సభలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.“హలో ఏపీ.బాయ్ బాయ్ వైసీపీ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇదే జనసేన వచ్చే ఎన్నికల నినాదం అని పవన్ ప్రకటించారు.
అభివృద్ధి జరగాలంటే… ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలంటే… ఈ ప్రభుత్వం పోవాలి, జనం బాగుండాలంటే.జగన్ పోవాలి” అని అమలాపురం సభలో పవన్ నినాదించారు.