భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. న్యూయార్క్ నుంచి గురువారం రోజున వాషింగ్టన్ చేరుకున్న మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. అధ్యక్ష దంపతులు జో బైడెన్.. జిల్ బైడెన్లు మోదీని వైట్‌హౌస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోదీ అమెరికాప ్రతినిధుల సభలో గంటపాటు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు.ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎటువంటి సందేహాలకు తావు ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు గడిచాయని, ’26/ 11′ దాడులు జరిగి దశాబ్దం గడుస్తున్నా రాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అటు చైనాపై కూడా మోదీ పరోక్ష దాడికి దిగారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంపైనే గ్లోబల్ ఆర్డర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీ అన్నారు.