ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ప్రతి రోజు వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇటీవల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వారాహి యాత్రను జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పవన్ ప్రజల దృష్టిలో విలన్‌గా మారుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవసరం కోసం స్క్రీప్ట్ ఇచ్చి పవన్‌తో బూతు పురానం మాట్లాడిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాటలు కాకుండా చిరంజీవి మాట వింటే పవన్‌కు మంచిదని, మీరు సింగిల్‌గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా 2024లో ఏపీ సీఎం మళ్లీ జగనేనని, ఇది రాసిపెట్టుకో అంటూ చురకలంటించారు. తనపై ట్రోల్స్ చేసే జనసేన కార్యకర్తలకు రోజా వార్నింగ్ ఇచ్చారు. మీ అంతు తేలుస్తానంటూ రోజా హెచ్చరించారు.
చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారన్న రోజా కామెంట్స్
