భారతీయులకు కోవిద్ సమయంలో సంజీవనిగా పనిచేసిన కోవాక్సిన్ టీకా రూపొందించిన భారత్ బయోటెక్ సంస్థ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. ఎల్లా కృష్ణ-సుచిత్ర దంపతులకు 2023 తానా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్‌కు ఆమోదం లభించినట్లు సమాచారం. తమిళనాడులోని తిరుత్తణిలో తెలుగు కుటుంబంలో జన్మించిన కృష్ణ, బెంగుళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం హవాయి విశ్వవిద్యాలయం నుండి మరో మాస్టర్స్ పట్టా అందుకున్న ఆయన, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి PhD తీసుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో Bayer సంస్థ వ్యవసాయ విభాగంలో పనిచేశారు. ఆ ఉద్యోగం మానేసి ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లారు. భారత్ తిరిగి వచ్చి 1996లో భారత్ బయోటెక్‌ను స్థాపించారు. వారికి తానా పురస్కారం పట్ల అమెరికాలోని ప్రవాస భారతీయులు, తెలుగువారు హర్షం ప్రకటించారు.
Breaking: డా.ఎల్లా కృష్ణ-సుచిత్ర దంపతులకు తానా జీవిత సాఫల్య పురస్కారం
Related tags :