Sports

ఇండియాకి ప్రమాదకర బౌలర్ లేడు

ఇండియా కి ప్రమాదకర బౌలర్ లేడు

టీమ్‌ఇండియా(Team India) గత కొంత కాలంగా ఐసీసీ(ICC) ఈవెంట్లలో తడబడుతోంది. తాజాగా WTC Finalలోకి వరుసగా రెండోసారి వచ్చి.. ఆస్ట్రేలియాకు ‘టెస్టు గద’ను అప్పగించి ఖాళీ చేతులతో వచ్చింది రోహిత్‌ సేన. దీంతో ఇంటా బయటా  విమర్శలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఒకరు.. టీమ్‌ఇండియాలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపాడు.

భారత జట్టుకు డేంజరస్‌ బ్యాటింగ్‌ విభాగం ఉందని.. అయితే బౌలింగ్‌ దళంలో డేంజరస్‌ బౌలర్‌ లేడని పాక్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌(Ahmed Shehzad) పేర్కొన్నాడు. ‘ఆ జట్టు పట్ల ఎలాంటి ఆగౌరవం లేదు. బుమ్రా, జడేజా, అశ్విన్‌లాంటి మంచి బౌలర్లు ఉన్నారు. ప్రత్యర్థిని భయపెట్టే ప్రమాదకర బౌలర్‌ జట్టులో లేడు. మరోవైపు బ్యాటర్లు మాత్రం డేంజరే’ అని షెహజాద్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో విశ్లేషించాడు. ఇక తాను చూసిన డేంజరస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అని.. అతడిని నెట్స్‌లో ఎదుర్కోవడం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. ఈ విషయంలో అక్తర్‌ కాకుండా తాను మరో బౌలర్‌ను గుర్తుచేసుకోలేనని చెప్పాడు.ఇక టీమ్‌ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమవుతోంది. తాజాగా టెస్టులకు, వన్డేలకు జట్టును బీసీసీఐ ప్రకటించింది.