Business

టీసీఎస్‌లో బయటపడ్డ కుంభకోణం

Auto Draft

టెక్ రంగంలో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో ఉద్యోగాల కోసం లంచాలు తీసుకున్న కుంభకోణం బహిర్గతం కావడం సంచలనంగా మారింది. కంపెనీలోని కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు హెచ్ఆర్ సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా కొనసాగుతుండగా, గడిచిన మూడు సంవత్సరాల్లోనే కాంట్రాక్టర్లతో సహా 3 లక్షల మంది నియామకాలు జరిగాయి. వారందరూ రూ. 100 కోట్లు సంపాదించి ఉండవచ్చని అంచనా. కంపెనీలోని ఓ విజిల్‌బ్లోయర్ ఈ కుంభకోణాన్ని టీసీఎస్ సీఈఓ, సీఓఓలకు మెయిల్ ద్వారా తెలియజేశారు. దాంతో స్కామ్‌ను బయటపెట్టిన వెంటనే టీసీఎస్ పరిష్కార చర్యలు ప్రారంభించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం కంపెనీ తన రీసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్(ఆర్ఎంజీ) నుంచి నలుగురు అధికారులను తొలగించింది. అంతేకాకుండా మూడు రిక్రూట్‌మెంట్ సంస్థలపై నిషేధం విధించింది. కాగా, టీసీఎస్ కంపెనీలో ఇలాంటి కుంభకోణం బయటపడటం ఇదే మొదటిసారి. కంపెనీ కొత్త సీఈఓగా కె కృతివాసన్ బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే ఇది జరగడం గమనార్హం.