NRI-NRT

యార్లగడ్డతో నా 50ఏళ్ల స్నేహం మరిచిపోలేనిది:వెంకయ్య

Venkaiah Naidu Recalls Friendship With Yarlagadda Lakshmiprasad In 75th Birthday Celebrations

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు 75 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అత్మీయ సమావేశంలో అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సౌజన్య దంపతులు వెంకయ్యనాయిడు దంపతులను ప్రత్యేకంగా సత్కరించారు. జై ఆంధ్రా ఉద్యమ కాలం నుండి దాదాపు 50 సంవత్సరాలకు పైబడి వీరిరువురి మధ్య అనుబంధం కొనసాగుతుండగా, ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయిడు మాట్లాడుతూ యార్లగడ్డ వంటి అత్మీయుడు, స్నేహితుడు తన వెన్నంటి ఉండటం తాను మరిచిపోలేని అన్నారు.