పిల్లి వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో నారింజ రంగు పిల్లి కాలేజీ విద్యార్థులతో పాటు క్లాస్ రూమ్‌కి వెళుతున్నట్లు కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే మైక్ అనే పిల్లికి చదువుపై ఎంత ఆసక్తి ఉందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. చదువుపై పిల్లికి ఉన్నశ్రద్ధ, ఆసక్తితో అది ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా రోజూ క్లాస్‌కు వెళ్తుంది.. అన్నీ క్లాసులు సమయానికి హాజరవుతుంది. మైక్ గత 4 నాలుగేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నట్టుగా వీడియోలో వెల్లడించారు.. అంతేకాదు..ఈ పిల్లి కోసం ఇక్కడ క్లాస్ రూమ్‌లో పర్మెంట్ సీటు కూడా ఉంది. టీచర్ క్లాసులు చెబుతున్నప్పుడు ఆ పిల్లి బ్లాక్ బోర్డ్ వైపు జాగ్రత్తగా చూస్తుంది. ఇకపోతే, మైక్ ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి,.. దానికి ఎప్పుడు నిద్రవస్తే..అప్పుడు క్లాస్‌లో తన సీటుపైనే హాయిగా నిద్రపోతుంది. క్లాస్ చివరిలో టీచర్ పిల్లిని మెల్లగా నిద్రలేపుతుంది.. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది.
టీచర్ నిద్రలేపగానే ఆ పిల్లికి కంప్యూటర్ క్లాస్ కూడా ఉందని గుర్తొచ్చింది. వెంటనే ఆ పిల్లి కంప్యూటర్ క్లాస్ వైపు వెళుతుంది. కంప్యూటర్ క్లాస్‌లో కోడింగ్ చెబుతున్న టీచర్ మాటలను జాగ్రత్తగా వింటుంది మైక్. ఆ క్లాస్‌లో కూడా తనకు నిద్రరాగానే పడుకుంటుంది. మళ్లీ లేచి టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అయితే, మైక్ ఎప్పుడూ క్లాస్ మిస్ చేయదని చెబుతున్నారు టీచర్లు.మార్నింగ్ సెషన్ ముగిసిన తర్వాత మైక్ లంచ్ చేసేందుకు వెళ్తుంది. అందుకోసం మైక్ తోటి విద్యార్థులతో పాటు లిఫ్ట్‌లో వెళ్లి డైనింగ్ హాల్‌కు చేరుకుంటుంది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి మైక్ కోసం ఆహారం తీసుకువస్తుంది. ఇదిలా ఉంటే, ఈ పిల్లి కాలేజీలోని టాప్ స్టూడెంట్స్‌లో ఒకటని టీచర్ చెప్పారు. ఇంతకీ ఈ మైక్ క్లాస్ రూమ్స్ కథేంటంటే..