Devotional

కాఠ్‌మాండు పశుపతినాధ్ ఆలయంలో 10కిలోల బంగారం మాయం?

కాఠ్‌మాండు పశుపతినాధ్ ఆలయంలో 10కిలోల బంగారం మాయం?

కాఠ్‌మాండూలో హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్‌ ఆలయం (Pashupati temple) అత్యంత ప్రాచీనమైనది. గతేడాది మహాశివరాత్రి సమయంలో అందులోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని (Jalahari) ఏర్పాటు చేశారు. ఇందుకోసం పశుపతి ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ 103 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ ఆభరణాల్లో దాదాపు 10కిలోల బంగారం మాయమైందన్న వార్తలు వచ్చాయి. దీనిపై అక్కడి పార్లమెంటులోనూ ప్రశ్నలు లేవనెత్తారు. స్పందించిన ప్రభుత్వం.. నేపాల్‌ అవినీతి నిరోధక శాఖను (సీఐఏఏ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీఐఏఏ అధికారులు.. ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.