WorldWonders

భారతదేశంలో తొలిసారిగా సైకియాట్రిక్ సర్జరీ

భారతదేశంలో తొలిసారిగా సైకియాట్రిక్ సర్జరీ

శరీరంలోని ఏ అవయవానికైనా నష్టం జరిగితే వైద్యులు ఆపరేషన్ చేస్తారు. గుండె, కిడ్నీ, కాలేయం, కళ్లు ఇలా అన్ని అవయవాలకు ఆపరేషన్ల ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.అయితే, దీర్ఘకాలిక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సర్జరీ చేయించుకుని సమస్య నుంచి దూరమ్యే అవకాశం ఉంటుందా? మానసిక సమస్యలకు ఆపరేషన్ ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. కుంగుబాటు(Depression)తో దాదాపు 26 ఏళ్లుగా బాధపడుతున్న ఆస్ట్రేలియా(Australia)కు చెందిన ఓ మహిళ (38) భారత్ లో సైకియాట్రిక్ ఆపరేషన్ చేయించుకుంది.

భారత్ లో మానసిక ఆరోగ్య రక్షణ చట్టం-2017 తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఈ చట్టం ప్రకారం మానసిక రోగి అంగీకారంతో సైకోసర్జరీ చేయొచ్చు. న్యూరోసర్జన్ పరేశ్ దోషీని ఆస్ట్రేలియాకు చెందిన ఆ మహిళ సంప్రదించింది. 10 నెలల పాట శ్రమపడి అన్ని ప్రక్రియలూ ముగించుకున్నాక మే 28న ఆపరేషన్ చేయించుకుంది.

ఇటువంటి సర్జరీకి దేశంలోని రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొట్టమొదటిసారి అనుమతి ఇచ్చిందని డాక్టర్ పరేశ్ చెప్పారు. జస్లోక్ హాస్పిటల్ లో ఆమెకు సర్జరీ చేసినట్లు వివరించారు. కొందరికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) సర్జరీ ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో భాగంగా మెదడులో ఎలక్ట్రోడ్లు ప్రవేశపెట్టి దాని ద్వారా నరాల ప్రతిస్పందన తీరును మార్చవచ్చు.

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ను పార్కిసన్ వ్యాధికేకాక అబ్సెసిస్ కంపల్సివ్ డిజార్డర్, డిప్రెషన్ వంటివాటినీ నయం చేయొచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. కొందరు చికిత్స తీసుకుంటే కోలుకుతున్నారు. సర్జరీ కాకుండా అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాత్రలు వేసుకోవడం, షాక్ థెరపీ వంటి వాటిని వైద్యులు సూచిస్తుంటారు.

ఆస్ట్రేలియా మహిళకు తాజాగా ఆపరేషన్ చేశామని, ఆమె గతంలో దాదాపు 20 రకాల యాంటిడిప్రెసెంట్స్ వాడి చూసిందని వైద్యులు చెప్పారు. కొన్ని రకాల థెరపీలు కూడా చేయించుకుందని అన్నారు. చివరకు ముంబైలోని జస్లోక్ హాస్పిటల్లో సర్జరీ గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చి చేయించుకుందని అన్నారు. డీబీఎస్ కు ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు అనుమతులు లేవని వివరించారు.