వ్యాపారాలకు లోన్లు ఇచ్చే బిజినెస్‌లోకి ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే ఎంట్రీ ఇచ్చింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) తన ప్లాట్‌ఫామ్ ద్వారా 3.5 కోట్ల మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెజ్ల (ఎంఎస్ఎంఈ) కు లోన్లు ఇవ్వొచ్చని కంపెనీ పేర్కొంది. తమ ప్లాట్ఫామ్లో మర్చంట్ లెండింగ్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని, మార్కెట్‌ప్లేస్ మోడ్‌లో ఈ సర్వీస్‌లు అందిస్తామని ఫోన్‌పే వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు ఆర్గనైజ్డ్ విధానంలో లోన్లు పొందే అవకాశం కలిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మూడు ఫైనాన్షియల్ సంస్థలతో పార్టనర్షిప్ కుదుర్చుకున్నామని, త్వరలో మరో 3–4 సంస్థలు జాయిన్ అవుతాయని వెల్లడించారు.రూ.15 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్లను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా బిజినెస్‌లు పొందొచ్చని వివరించారు. ఎన్బీఎఫ్సీ లైసెన్స్ తీసుకునే ఉద్దేశం లేకపోవడంతో బ్యాంక్ పార్టనర్షిప్స్తో లెండింగ్ బిజినెస్‌లోకి కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ‘సొంతంగా ఎన్బీఎఫ్సీ బిజినెస్‌ను స్టార్ట్ చేయడం లేదు. గత రెండు నెలల్లోనే 20 వేల లోన్లను డిస్బర్స్ చేశాం’ అని పేర్కొన్నారు. కాగా, కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో మర్చంట్లకు లోన్లు ఇచ్చే సర్వీస్‌ను పైలెట్‌గా లాంచ్ చేసింది. ఎంఎస్ఎంఈల కోసం ఈ నెల 14 న పేమెంట్ గేట్‌వేను కూడా ఫోన్‌పే తీసుకొచ్చింది.