Movies

అత్యంత ఖరీదైన కారును కొన్న మహేష్

అత్యంత ఖరీదైన కారును కొన్న మహేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ బాయ్ గా పేరు ఉన్న హీరో ఎవరంటే మహేష్ బాబు అని చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు దశాబ్దాలుగా స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి… ఆయన పేరు నిలబెడుతూ,తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు లగ్జరీ లైఫ్ మెయింటేన్ చేస్తాడు. సినిమాలతో పాటు యాడ్స్, ఇతర వ్యాపారాల్లోనూ మహేష్ బిజీగా ఉంటాడు. దీంతో ఆయనకు కోట్లల్లో టర్న్ అవర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కార్లు, బంగ్లాలు కొనుగోలు చేశాడు. తాజాగా ఆయన ప్రపంచంలో అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ ను కొనుగోలు చేశాడు. దీని ధర చూసి సినీ ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

రేంజ్ రోవర్..ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తుంది. రేంజ్ రోవర్ నుంచి లేటెస్ట్ గా హై ఎండ్ ఎస్ యు వి మోడల్ మార్కెట్లోకి వచ్చింది. దీనిని ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కొనుగోలు చేయలేదు. రూ. 5.41 కోట్లు పెట్టి మహేష్ బాబు కొనుగోలు చేయడం ఆసక్తిగా మారింది. గోల్డ్ కలర్ లో ఉన్న ఈ కారులో మహేష్ బాబు షూటింగ్ కు వెళ్తున్నారు.
అయితే రేంజ్ రోవర్ కంపెనీ నుంచి ఇప్పటివరకు మోహన్ లాల్, అల్లు అర్జున్ లాంటి వారు కార్లు కొనుగోలు చేశారు. కానీ లేటెస్ట్ మోడల్ ను మహేష్ బాబు మాత్రమే కొనుగోలు చేశాడు. దీంతో మహేష్ బాబు గురించి ఇప్పుడు ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇప్పటివరకు మహేష్ బాబు క్యారేజీ క్యారేజీలో పదులకొద్దికారులు ఉన్నాయి ఇప్పుడు మరో కారు వాటి సరసన చేరింది.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే సినిమాలో నటించే అవకాశం ఉంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ గుంటూరు కారం మిర్చి పోస్టర్ ను చూసి అభిమానులు అంచనాలు భారీగా పెంచేసుకున్నారు. ఇక ఆగస్టు 29 ఆయన బర్త్డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.