చదువుకున్నవారికే ఉద్యోగాలు రావడం కరువైపోతున్న ఈ రోజుల్లో కుక్కను చూసుకుంటే చాలు కోటి జీతం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని కోసం ఇప్పటికే సుమారు 400 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నివేదికల ప్రకారం, లండన్‌కి చెందిన ఒక బిలీనియర్ తన కుక్కను చూసుకోవడానికి ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసాడు. అంతే కాకూండా కుక్కను చూసుకునే వారికి 42 రోజులు సెలవులు, దానిని ఎక్కడికి తీసికెళ్తే అక్కడికి లగ్జరీ జెట్‌లో ప్రయాణించే ఛాన్స్ కూడా కల్పించనున్నాడు. ఆ సమయంలో భోజనంతో పాటు అన్ని రకాల ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉచితంగానే అందిస్తారు.
ఈ జాబ్‌లో భాగంగా ప్రతి రోజు కుక్కలకు ఆహారం అందించాలి. వాటికి అనారోగ్య సమస్యలు ఎదురైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ప్రతి రోజు స్నానం చేయించాలి. ఇలా రోజు వాటి అవసరాలను చూసుకుంటే చాలు, వారు ఏడాదికి రూ. కోటి జీతం పొందవచ్చు. అయితే అవి తినే ఆహారం మీద పూర్తిగా అవగాహన ఉండాలని చెబుతున్నారు. అంతే కాకుండా వారు వారి జీవితం కంటే కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.