NRI-NRT

తానా సభల్లో కళ్యాణమస్తు

తానా సభల్లో కళ్యాణమస్తు

తానా సభల్లో కళ్యాణమస్తు…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను తానా కాన్ఫరెన్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ‘తానా కళ్యాణమస్తు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మెట్రిమోనియల్‌ సర్వీసెస్‌ను అందిస్తున్న 7 స్టెప్స్‌ డాట్‌ కామ్‌ వారితో కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, వారి తల్లితండ్రులు పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

అమెరికాలోని యువతీ యువకులు, వారి తల్లితండ్రులు ఒకరినొకరు కలుసుకుని ఒకరికి ఒకరు తెలుసుకుని తమ ఇష్టాలకు అనుగుణంగా ఉన్న వివాహ బంధాలను ఏర్పాటు చేసుకునేందుకు వేదికగా ఈ తానా కళ్యాణమస్తు ఉంటుందని, తమకు నచ్చిన ప్రొఫెషనల్స్‌తో కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని కూడా ఈ వేదిక కల్పిస్తోందని నిర్వాహకులు చెప్పారు. దీంతోపాటు వివిధ కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకోసం కాన్ఫరెన్స్‌ వెబ్‌ సైట్‌ ను లేదా ఫ్లయర్‌ ను చూడండి.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకునేవారు 21 నుంచి 40 వయస్సు మధ్య ఉండాలని, రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారు ఈ కింది లింక్‌ ను ఉపయోగించి చేసుకోవచ్చు.

Register athttps://tanaconference.org/matrimonial-registration.html