సాగినా, కాన్సాస్ సిటీ అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో మొత్తం అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. 17 మంది గాయపడ్డారు. మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో ఆదివారం ఉదయం 57వ వీధి, ప్రోస్పెక్ట్ అవెన్యూ కూడలి వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మిషిగాన్ రాష్ట్రంలోని సాగినా నగరంలో శనివారం అర్ధరాత్రి ఓ వీధి పార్టీ జరుగుతుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 51 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల యువకుడు మరణించారు. 12 మందికి గాయాలయ్యాయి.