Business

భారీగా తగ్గిన టీఎస్‌ఆర్టీసీ ఛార్జీలు

భారీగా తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ ఛార్జీలు

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఎగిరిగంతేసే శుభవార్త వినిపించింది. మొన్నటివరకు ఛార్జీలు పెంచుతూ బ్యాడ్ న్యూస్ వినిపించిన టీఎస్ఆర్టీసీ ఇప్పుడు తగ్గిస్తూ గుడ్‌న్యూస్ వినిపించింది. అయితే.. టీ 24 టికెట్ ధరలతో పాటు డైనమిక్ టికెటింగ్ విధానంతో బాదుడుకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ.. ఇప్పుడు సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌ను టీఎస్ఆర్టీసీ సవరించింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ లగ్జరీ, ఏసీ స‌ర్వీసుల్లో ఛార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20, 350 ఆపై కిలోమీట‌ర్లకు రూ.30 ఛార్జీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ సర్వీసుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నుంది.ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్దన్, ఎండీ వీసీ స‌జ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న ఉందని తెలిపారు. ప్రతీ రోజు స‌గ‌టున 15 వేల వ‌ర‌కు త‌మ టికెట్లను ప్రయాణికులు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారన్నారు. వారికి ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌ను త‌గ్గించామని తెలిపారు.