Business

హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు పెద్ద వార్త -TNI నేటి వాణిజ్య వార్తలు

హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు పెద్ద వార్త -TNI నేటి వాణిజ్య వార్తలు

జీఎస్టీ మోసం బట్టబయలు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్స్‌ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్‌ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (డీజీజీఐ) జైపూర్‌ జోనల్‌ యూనిట్‌ గుర్తించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రూ.1,047 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) మోసంలో 569 నకిలీ సంస్థలను అధికారులు కనుగొన్నారు.

రెండో రోజు రైతుబంధు నిధుల జమ

 రెండో రోజు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో 3 జమ అయ్యాయి. ఈరోజు మొత్తం 16,98,957 మంది రైతుల ఖాతాలలో రూ.1,278.60 కోట్లు జమ అయ్యాయి. కాగా రెండు రోజుల్లో 39,54,138 మంది రైతుల ఖాతాల్లో రూ.1921.18 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయం మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా?

హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు పెద్ద వార్త

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్‌డిఎఫ్‌సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ మంగళవారం ప్రకటించారు.విలీనానికి ఆమోదం తెలిపేందుకు జూన్ 30న మార్కెట్ ముగిసిన తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బోర్డులు సమావేశమవుతాయని హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. గ్రూప్ వైస్-ఛైర్మెన్ మరియు CEO కేకి మిస్త్రీ ప్రకారం, HDFC స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 2023 నుండి అమలులోకి వస్తుందన్నారు. అంటే జూలై 13న గ్రూప్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి తొలగించబడతాయి.

పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్

అధిక పింఛన్ కోరుకునే ​​దరఖాస్తుదారులకు ఈపీఎఫ్ఓ ఇచ్చిన గడవు జూన్ 26తో ముగిసింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ ​​గడువు వాయిదా వేస్తారని పేర్కొన్నా ఇప్పటివరకూ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వెల్లడికాలేదు. నవంబర్ 4, 2014న సుప్రీం కోర్ట్ సెప్టెంబర్ 1, 2014కి ముందు ఈపీఎఫ్ఓ ​​ఉద్యోగులను అనుమతించింది. ఆ తేదీ తర్వాత పనిలో కొనసాగి ఈపీఎస్ కింద ఉమ్మడి ఎంపికను ఉపయోగించలేకపోయిన వారు తీర్పును అనుసరించి నాలుగు నెలల్లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. 

* కియా 30వేల కార్ల రీకాల్‌

కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ కియా ఇండియా.. 30 వేల యూనిట్ల కారెన్స్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్‌ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు తయారైన 30,297 మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నది.

రేపు అకౌంట్లలోకి రూ.13,000

పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థులు తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమచేస్తారు. కాగా, ఈరోజుతో KYC పూర్తయిన వారి అకౌంట్లలో రేపు డబ్బులు జమవుతాయి. ఏదైనా సాంకేతిక కారణాలతో జూన్ 28 తర్వాత KYC చేసుకున్నవారికి జులై మొదటి వారంలో జరిగే వారోత్సవాల్లో నగదు జమ చేస్తారు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అందుకే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని సార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అయితే.. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. స్వర్ణం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ధరలు పెరిగాయి. మంగళవారం బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి.. రూ.54,350 కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,280గా ఉంది. వెండి ధర కిలో.. 70,900 లుగా కొనసాగుతోంది.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 446 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంలో సూచీలు లాభాల్లో పయనించాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,151 పాయింట్లు లాభాలతో మొదలై లాభాల్లో కొనసాగింది. చివరి గంటలో మదుపరుగులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 63,467 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. చివరకు 446.03 పాయింట్ల లాభంతో 63,416.03 వద్ద స్థిరపడింది.

బిగ్ బాస్-7 కోసం రూ.130 కోట్లు ?

తాజాగా మొదలుకానున్న బిగ్ బాస్-7 తమిళ సీజన్ కోసం కమల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నుండి స్టార్ట్ కాబోతున్న ఈ షో కోసం దాదాపు రూ.130 కోట్లు తీసుకోనున్నట్లు తమిళ నాట వినిపిస్తోంది. దీంతో ఈ షో పై భారీ హైప్ క్రీయేట్ అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా అని ప్రేక్షకులు కూడా తెగ ఎదురుచూస్తున్నారు.

ఒక్క సినిమాకు రూ.200 కోట్లు పారితోషికం ?

తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరో దళపతి విజయ్ రెమ్యునరేషన్లో రికార్డు సృష్టించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దళపతి 68’ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్ల పారితోషికాన్ని తీసుకోనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో షారుఖ్, సల్మాన్, అక్షయ్ ను పక్కకు నెట్టి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా విజయ్ నిలిచాడు. ఇప్పటివరకూ దళపతి ఒక్క సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారు.