Food

బీరు ఆమ్లెట్ తింటారా?

బీరు ఆమ్లెట్ తింటారా?

మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల అమ్లేట్లు తిన్నారు. విన్నారు. ఇటీవల మామిడి పండ్ల ఆమ్లేట్ గురించి కూడా తెలుసుకున్నారు. మరి బీర్ ఆమ్లేట్ గురించి ఎప్పుడైనా విన్నారా..ఎక్కడైనా తిన్నారా..బీర్ తో ఆమ్లేటా అని ఆశ్చర్యపోతున్నారా..అవును నిజం. ఓ వ్యక్తి బీర్ తో  ఆమ్లేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియోలో ఓ వ్యక్తి స్టవ్ పై భారీ పెనాన్ని పెట్టాడు. ఆ తర్వాత పెనంపై నూనేకు బదులు  బీర్ ను పోశాడు. అప్పటికే కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనంపై పోశాడు. దానిపైన, చుట్టూ  కూడా మళ్లీ బీర్ ను పోశాడు. మళ్లీ ఎగ్ మిశ్రమంలో మరింత బీర్ పోసి మిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమ్లెట్ ను భుర్జీలా చేశాడు. అనంతరం  కస్టమర్లకు బీర్ ఆమ్లెట్ ను సర్వ్ చేశాడు.