DailyDose

న్యాయమూర్తులకు బహుమతులు ఇవ్వొద్దు

న్యాయమూర్తులకు బహుమతులు ఇవ్వొద్దు

హైకోర్టు న్యాయమూర్తులను న్యాయశాఖ అధికారులు కలిసినప్పుడు శాలువాలు, బహుమతులు ఇవ్వొద్దని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల ప్రవర్తనా నియమావళికి సంబంధించి తమిళనాడు స్టేట్ జ్యుడిషియల్‌ సర్వీస్‌, పుదుచ్చేరి జ్యుడిషియల్‌ సర్వీస్‌ అధికారులకు ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది. ‘పదోన్నతులు, బదిలీల కోసం న్యాయమూర్తుల నివాసాలకు వెళ్లొద్దు. న్యాయమూర్తులు న్యాయవాది లేదా కక్షిదారు నుంచి ఎలాంటి ఆతిథ్యం స్వీకరించవద్దు’ అని అందులో పేర్కొంది. కోర్టు ప్రాంగణం బయట ఉన్నప్పుడు న్యాయాధికారులు నలుపు రంగు కోటు, టై ధరించవద్దని స్పష్టంచేసింది.