దీపావళి పండగ కోసం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని అగ్రరాజ్యంలో చేసిన పోరాటం ఫలించింది. న్యూయార్క్ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సక్సెస్ అయ్యింది. న్యూయార్క్‌లో గల స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ఇస్తామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు.
సిటీలో గల స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సిందేనని న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ కోరుతున్నారు. గత రెండు దశాబ్ధాలుగా ఇదే అంశంపై పోరాడుతున్నారు. చివరికీ వారి కల నెరవేరింది. తాము అనుకున్నది సాధించామని చెబుతున్నారు. స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ప్రకటించినప్పటికీ అదీ ఈ ఏడాది మాత్రం అందుబాటులో ఉండదు.2023-24కు సంబంధించి క్యాలండర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. సో.. వచ్చే ఏడాది 2024 దీపావళి నుంచి పాఠశాలలకు సెలవు ఇస్తారు.
న్యూయార్క్‌లో దీపావళికి సెలవు ఇచ్చే బిల్లుపై గవర్నర్ కేథి హోచల్ సంతకం చేసిన తర్వాత చట్టంగా మారుతుంది.అప్పటినుంచి సెలవు అధికారికం అవుతుంది. ఆ రోజు స్కూళ్లకు సెలవు దొరికితే పిల్లలతో కలిసి సరదాగా గడపొచ్చని పేరంట్స్ అంటున్నారు. ఆ మేరకు డిమాండ్ చేయగా.. కల నెరవేరింది.